Thursday, January 23, 2025

కాంగ్రెసోళ్లను టచ్ చేస్తే క్రేన్‌కు ఉరేసి వేలాడదీస్తా: కొండా మురళీ

- Advertisement -
- Advertisement -

వరంగల్: కాంగ్రెస్ నేత కొండా మురళీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే వాళ్లతో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే క్రేన్‌కు ఉరేసి వేలాడదీస్తానని హెచ్చరించారు. తనలోని పాత మురళీ పటేల్‌ను బయటకు తీసుకరావొద్దన్నారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదేనని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. ఎంతమంది వచ్చినా గెలిచేది కొండా సురేఖేనని ధీమా వ్యక్తం చేశారు. బిసిలకు అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తనతో చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొండా మురళీ  వర్సెస్ వరంగల్ డిసిస అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మధ్య గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి.

Also Read: షీ ఇన్ ‘తేలుకుట్టిన దొంగ’ కథ!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News