Wednesday, January 22, 2025

కొమటిరెడ్డి తోనే పార్టీకి నష్టం: కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి నేతల వలనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి లాంటి నేతలను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో హాత్ సే జోడో పాదయాత్రకు సంబంధించి చర్చలు జరిగాయి. ఈ సందర్బంగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొండా సురేఖ తీవ్రవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకపోవడం వలనే గత ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు.

ఇప్పటికైనా పార్టీలో అందరూ కలిసి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను ఆమె కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే క్రమశిక్షణ లేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని, పార్టీకి నష్టం చేసే వారిని తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు ఇప్పుడు సమయం కాదని, ఇటువంటి విషయాలు తర్వాత చర్చిద్దామని సూచించారు. వ్యక్తిగత విషయాలు ఉంటే ఇన్‌చార్జ్‌ను కలవాలని కోరారు. ప్రస్తుతం పార్టీలో పాదయాత్రకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నామని సర్దిచెప్పారు.

ఇదిలావుండగా మాజీమంత్రి గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రతోనే పార్టీ బలపడుతుందని, గతంలో చేవెళ్ళ నుంచి దివంగత్ సిఎం వైఎస్సార్ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News