Friday, December 20, 2024

వైభవంగా కొమురవెల్లి మల్లన్నకల్యాణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయ కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. మండపంలో దేవాదాయ శాఖ నిర్వహించిన కల్యాణమహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తళంబ్రాలను సమర్పించి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్, మేడ్చల్ ఎంఎల్‌ఏ , మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి సహా వేలాది మంది భక్తులు కూడా హాజరైనారు.

Pooja

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News