Tuesday, March 18, 2025

బిజెపి సభ్యులు వివాదాలు సృష్టించాలని చూస్తున్నారు: కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోడలు దూకడం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు అలవాటని, ఆ అలవాట్లే అందరికీ ఉంటాయనుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లు చేయడం మీకు అలవాటే కదా అని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పై స్టింగ్ ఆపరేషన్ చేశారా? అని ప్రశ్నించారు. కెబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందనుకోవడం లేదని చెప్పారు. తిరుపతిలో తెలంగాణ మంత్రుల లెటర్లు అనుమతించాలని…త్వరలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడును కలిసి కోరతానని తెలిపారు.

బిజెపి సభ్యులు వివాదాలు సృష్టించాలని చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, కేంద్ర సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదని తెలియజేశారు. దేవదాయ శాఖ పరిధిలోని భూములను రక్షిస్తామని, అన్యాక్రాంతం కాకుండా మహిళలకు లీజ్ కు ఇస్తామని పేర్కొన్నారు. అన్ని దేవాలయాలను ఒకే గొడుగు కిందకు తెస్తామని, ప్రతి ఆలయ ఖర్చులు థర్డ్ పార్టీతో ఆడిట్ చేపిస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News