Wednesday, January 29, 2025

రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కిందపడిన కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖకు తృటిలో ప్రమాదం తప్పింది. బైక్ నుంచి అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ తలకు గాయాలయ్యాయి. తక్షణమే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో భాగంగా రెండవ రోజు ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టిపిసిసి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News