Monday, January 20, 2025

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నేత కొండా సురేఖ. 1965 ఆగస్ట్ 19న జన్మించారు. 1995లో మండల పరిషత్‌కు ఎన్నికల్లో విజయం సాధించి సంచలనంగా మారారు. 1996లో పిసిసి సభ్యురాలుగా పని చేశారు. 1999లో శాయంపేట నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2000లో ఎఐసిసి సభ్యురాలిగా నియమితులయ్యారు. 2004లో శాయంపేట నుంచి రెండో సారి ఎంఎల్‌ఎగా గెలుపొందారు.

2009లో పరకాల నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన సురేఖ జగన్ వెంట నడిచారు. 2013లో వైసిపికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు. 2018లో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News