Friday, December 27, 2024

నా వ్యాఖ్యలపై చాలా బాధపడ్డా.. కానీ, కేటీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధ పడ్డానని మంత్రి కొండా సురేఖ అన్నారు. నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కెటిఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడిపోయారని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరారు.

అంతకుముందే, ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా హనుమకొండలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు.నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చింది.మరొకరిని నొప్పించానని తెలిసి చాలా బాధపడ్డాను.అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను. కేటీఆర్‌ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News