- Advertisement -
బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండ సురేఖ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని బిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ నేతలకు లేదని దుయ్యబట్టారు.
ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారని.. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారని.. హుజురాబాద్ ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. బిఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకు వచ్చారని విమర్శించారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు?.. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.
- Advertisement -