Wednesday, January 22, 2025

‘ఫోన్ ట్యాపింగ్ లో ఎర్రబెల్లి హస్తం’!

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన భర్త మురళి ఫోన్ ను కూడా గతంలో ట్యాప్ చేశారని, ఎర్రబెల్లి ప్రోద్బలంతోనే ఇది జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వరంగల్ లో బుధవారం నాడు మంత్రి మాట్లాడుతూ.. పదేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందన్నారు. ప్రాజెక్టులు కట్టినా, నిర్మాణ లోపాల కారణంగా నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడమే ప్రస్తుత నీటి ఎద్దడికి కారణమని సురేఖ చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని, రైతుల కష్టాలు తీరుస్తామని చెప్పారు.

మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆమె చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం ఊచలు లెక్కబెట్టడం ఖాయమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News