Friday, April 25, 2025

మంత్రిగా కొండా సురేఖ తొలి సంతకం.. ఎక్స్ గ్రేషియా పెంపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. అటవీ శాఖ కార్యకలాపాలపై మంత్రి కొండా సురేఖ తొలి సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ పథకాలు, పనులపై సంరక్షణ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. జంతువుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంచారు. ఎక్స్ గ్రేషియా పెంపుపై తొలిసంతకం చేశారు మంత్రి కొండా సురేఖ. ఎక్స్ గ్రేషియా రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చెందుకు అనుమతిస్తూ మంత్రి మరో సంతకం చేశారు. ఈ సందర్భంగా అటవీ, దేవాదయ శాఖలో ఉన్న ఖాళీల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News