Monday, January 20, 2025

ఉత్పత్తి చేసిన తేనె వైల్డ్ ఫ్లేవర్స్‌ను ఆవిష్కరించిన కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సిఆర్‌ఐ ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రంలో తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు.

రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నది. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ది చేసిన తేనెను వైల్ ఫ్లేవర్స్ బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News