Wednesday, October 16, 2024

మంత్రి సురేఖ వ్యాఖ్యలు అనుచితం

- Advertisement -
- Advertisement -

క్రిమినల్ చర్యలు తీసుకోండి కోర్టులో
నటుడు నాగార్జున వాంగ్మూలం
మన తెలంగాణ/హైదరాబాద్ : నాంపల్లి కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరు కాగా నాగార్జునతో పాటు సాక్షుల వాం గ్మూలం కోర్టు రికార్డ్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును నాగార్జున ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొం డా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా మంగళవారం కోర్టులో హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో నాగార్జున వెంట అమల, నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల కూడా కోర్టుకు హాజరయ్యారు. “సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి.

జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా కుమారుడు విడాకు లకు మాజీ మంత్రి కెటిఆర్ కారణం అని మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్‌లో ప్రచురితం చేశాయి. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది.

దేశ వ్యాప్తంగా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడింది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది” అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జున స్టేట్‌మెంట్ పూర్తి అయిన తరువాత సాక్షిగా సుప్రియ స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసుకుంది. “కెటిఆర్ వల్ల నాగ చైతన్య, సమంత విడాకులు జరిగాయని అని మంత్రి మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో సమంతను కెటిఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదు. అందుకే విడాకులు తీసుకుందని మంత్రి మాట్లాడారు. దీంతో మా కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఈ విధంగా మంత్రి మా కుటుంబంపై ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. దాంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు నేను కొన్ని మీడియా చానెళ్లలో చూశా. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త విన్నాను. మరుసటి రోజు పేపర్లో కూడా వార్త వచ్చింది. దీని వల్ల మా కుటుంబం తీవ్రమైనోవేదనకు గురైంది” అంటూ సుప్రియ వాంగ్మూలం ఇచ్చారు.

10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ?

కోర్టు వాదనల అనంతరం నాగార్జున తరఫు న్యాయవాది అశో క్ రెడ్డి మాట్లాడుతూ, మెుదటి సాక్షి సుప్రియ వాంగ్మూలం రికార్డ్ చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తారని తెలిపారు. అనంతరం ఈనెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేశామన్న ఆయన, మంత్రిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున వాంగ్మూలం ఇచ్చారని వివరించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ తరపు కౌన్సిల్స్ తిరుపతి వర్మ స్పందిస్తూ, మంత్రిపై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో వాంగ్మూలాలలో తేడాలు ఉన్నాయన్నారు. నాగార్జున పిటిషన్లో ఒకటి చెప్పారని, వాంగ్మూలల్లో మరొకటి చెప్పారన్నారు. ఆయన కోడలు సుప్రియ వాంగ్మూలలో మరొకటి చెప్పారని తెలిపారు. ఆమెను సాక్షిగా ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News