Wednesday, January 22, 2025

కొండా సురేఖ వర్సెస్ సునీతారెడ్డి… ప్రోటోకాల్ రగడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ జిల్లా కొల్చారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కొల్చారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి అధికారం లేనివారు వేదికపై ఉన్నారని ఎంఎల్‌ఎ సునీతారెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఎంపిటిసి, అధికారులను వేదికపై ఎందుకు ఆహ్వానించలేదని సునీతారెడ్డి అడిగారు. దీంతో సునీతా రెడ్డి, కొండా సురేఖ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మంత్రి కొండా సురేఖ వెనుదిరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News