Wednesday, January 22, 2025

బిజెపిని వీడడం లేదు : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపిని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బిజెపిపై నమ్మకం ఉందని.. రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను తమ పార్టీ ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిలో తానే కాదు.. మరెవరూ కూడా పార్టీని వీడటం లేదని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బిజెపికే ఉందని..కాబట్టి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరాలని సూచించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి ని కూడా పార్టీలో చేరాలని కోరామన్నారు.

మతానికో కోడ్ ఉండాలని కాంగ్రెస్ అంటోందని, భారత్ జోడో యా త్ర చేపట్టిన వారు కాశ్మీర్‌కు వేరే కోడ్ ఉండాలని అనడం ఏమిటని విమర్శించారు. కవిత లిక్కర్ కేసు విచారణను దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని, ఈ విషయంలో పార్టీకి సంబంధం లేదన్నారు. పార్టీలో మార్పు అనగానే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలనడం కాదని తెలిపారు. పార్టీలో ఉన్న ఇతర సమస్యలపై అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు. తన మనస్సులో మాటను ఓ టివి ఛానల్ ఇంటర్యూలో చెప్పానని.. అంతే కానీ.. తాను పార్టీ మారడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పలు చానళ్లు, పత్రికలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. బిఆర్‌ఎస్‌పై ప్రజా వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News