Monday, December 23, 2024

రూ.32 వేల కోట్లు కావాలి..రుణ మాఫీ సాధ్యమేనా..?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ చేయాలంటే రూ.32 వేల కోట్లు అవసరమవుతాయని, అయితే ప్రభుత్వం వద్ద జీతాలు చెల్లించేందుకే నిధులు లేకపోతే రూ.2 లక్షల రుణ మాఫీ ఎలా చేస్తారని బిజెపి నేత, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలేనని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

రైతుల రుణమాఫీకి రూ.32వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు..? ఎలా ఇస్తారనే అంశంపై ఇంత వరకు స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల్లో ఇప్పుడు ఇస్తున్న ఐదు కిలోల బియ్యానికి బదులు పది కేజీలు ఇస్తామని
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఖర్గే కనీస ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచపటంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పని చేస్తున్నారన్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News