Wednesday, January 22, 2025

సిఎంఆర్‌ఎఫ్‌తో ఆపదలో కొండంత అండ

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ సాయినగర్ కాలనీకి చెందిన రవికుమార్ పర్వతనేనికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజురై 2లక్షల ఆర్థిక సహాయం, సిఎంఆర్‌ఎస్‌ఎల్‌ఒసి పత్రాన్ని బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్షంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సిఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News