Wednesday, January 22, 2025

తెలుగుదేశం పార్లెమెంట్ నియోజకవర్గ అద్యక్షుడిగా కొండపల్లి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అద్యక్షులుగా మహబూబాబాద్‌కు చెందిన సీనియర్ నాయకులు కొండపల్లి రాంచందర్‌రావును వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షులు కాసాని జ్ఙానేశ్వర్ సమక్షంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకుల అభిప్రాయాల మేరకు కొండపల్లి రాంచందర్‌రావును వరుసగా రెండో సారి రాంచందర్‌రావును ఏకగ్రీవంగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

ఈ మేరకు ఆయనకు పార్లమెంట్ అద్యక్షులుగా నియమిస్తూ కాసాని జ్ఙానేశ్వర్ నియామకపత్రాన్ని అందజేశారు. తనకు పార్టీలో సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ప్రోత్సహిస్తున్న పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అద్యక్షులు కాసాని జ్ఙానేశ్వర్, పోలిట్‌భ్యూరో సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులకు రాంచందర్‌రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకం పట్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News