Thursday, January 23, 2025

సిఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి సోదరులు భయపెడుతున్నారని సూసైడ్
నోట్ 40ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిముందు అడ్డుగా
గోడ నిర్మించారని ఆరోపణ ఇంటికి దారి ఇవ్వకుండా
అడ్డుకుంటున్నారని ఆవేదన మాజీ సర్పంచ్
పాంకుంట సాయిరెడ్డి సూసైడ్ నోట్

మన తెలంగాణ/కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చ పేట నియోజకవర్గం వం గూరు మండలంలో మాజీ సర్పంచ్ పాంకుంట సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సంచల నం రేపింది. 40 ఏళ్ల కింద తాము నిర్మించుకున్న ఇం టికి దారి ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు అడ్డుకుంటున్నారని, భయపెడుతున్నారని ఆయన ఆరోపిస్తూ సూసైడ్ నో ట్ రాసి ఆత్మహత్య చే సుకున్నాడు. మృతుడు సాయిరెడ్డి సూసైడ్ నో ట్‌లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగూ రు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామానికి చెంది న నాలుగు దశాబ్దాల క్రితం గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపాడు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతని సోదరులు గతంలో తన ఇంటికి వెళ్లకుండా ఇంటిముందు ప్రభుత్వ పశువుల దవాఖానా నిర్మించారని తెలిపాడు. తమ గ్రామానికి చెందిన ఎనముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని సోదరులు తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని ఆ లేఖలో పేర్కొన్నాడు. గత కొంత కాలంగా తన ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా ముఖ్యమంత్రి సోదరులు అడ్డుగా గోడ నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగు దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇంటికి దారి ఇవ్వకుండా తనను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి సోదరుల బాధ భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిరెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా, సాయిరెడ్డి ఆత్మహత్యకు సంబంధించి వంగూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన వివరాలు తెలియరాలేదు. అయితే తమకు ఎవరూ ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News