భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నయా రికార్డును నమోదు చేసింది. కేరీర్‌లో మరో బిగ్గెస్ట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చెక్ పెట్టిందంటే మ్యాచ్ విన్ అయినట్లేనని తల్చిచెప్పింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుంది హంపి. యుఎస్ వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్‌లో జయకేతనం ఎగురవేసి, 2024 సంవత్సరానికి గెలుపు ముగింపు పలికింది. సగటున 8.5 పాయింట్లతో ఫైనల్స్ ఆడే అర్హతను సాధించింది హంపి. సుకందర్‌ను ఢీకొట్టింది. తుది పోరులో ఇండోనేషియాకు చెందిన ఇరేనె సుకందర్‌తో తలపడగా హంపి మాస్టర్ గేమ్‌తో 11వ రౌండ్‌లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది.
ఫిడె ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో టైటిల్‌ను నెగ్గడం హంపికిది రెండోసారి. అంతకుముందు 2019లో మాస్కోలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిందామె. కాగా, ఈ టైటిలఖ కోసం ఆరుగురు గ్రాండ్ మాస్టర్లు పోటీపడ్డారు. జు వెగనూమ్, కేథరినా లాగ్నో, ద్రోణవల్లి హారిక, అర్‌ఫుజ్ ఖమ్‌దామోవ, టాన్ ఝంగ్యిలు ఈ టైటిల్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ రౌండ్ వరకూ వచ్చారు. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వొలొదర్ అర్టురోవిచ్ ముర్జిన్ ఈ టైటిల్ గెలిచాడు. 18 సంవత్సరాల వయస్సులోనే ఈ టైటిల్‌ను అందుకున్న రెండో గ్రాండ్ మాస్టర్‌గా ఫోట్ సాధించాడు. ఇదివరకు నొబిర్‌బెక్ అబ్డుసట్టొరొవ్ 17 సంవత్సరాల వయస్సులో ర్యాపిడ్ ఛెస్ టైటిల్ నెగ్గాడు.