- Advertisement -
అల్మాటీ: మాజీ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ కోనేరు హంపీ కజకిస్థాన్‌లోని అల్మాటీలో జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత దేశానికి తొలి రజత పతకాన్ని సాధించింది. 17వ , ఆఖరి రౌండ్‌లో చైనాకు చెందిన జోంగీ టాన్‌ను ఓడించి రజతం గెలుచుకుంది. నాల్గవ సీడ్ క్రీడాకారిణి హంపీ 12.5 పాయింట్లు సాధించింది. స్వర్ణ పతక విజేత అయిన కజకిస్థాన్‌కు చెందిన బిబిసర బాలబయెవా కంటే కేవలం సగం పాయింట్ వెనుకబడింది. ప్రపంచ బ్లిట్జ్‌లో మెడల్ సాధించిన రెండో భారత వాసి కోనేరు హంపీ. ఇదివరలో విశ్వనాథ్ ఆనంద్ మొదట గెలిచారు. అంతర్జాతీయ చెస్ గవర్నింగ్ బాడీ FIDE సంవత్సరం చివరిలో వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం దీనిని కజకిస్థాన్ రాజధాని అల్మాటీలో 26-30 డిసెంబర్ 2022 వరకు జరిగింది.
- Advertisement -