Wednesday, January 22, 2025

ఎపి మంత్రి మంత్రివర్గంలోకి నాగబాబు ?

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనసేనలో నాగబాబు ఎన్నికల ముందునుంచి కీలకంగా పనిచేస్తున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో సోదరుడి ప్రచార బాధ్యతలను ఆయన చేపట్టారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగగా టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడిని నియమించారు.

ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ కావడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై స్పష్టత వచ్చిందని, బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తీరా చూస్తే మూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి వెళ్లాయి. దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కలేదు. తాజాగా నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనకు కేబినెట్‌లో బెర్త్ కన్‌ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీ రాజకీయాల కోసమేనా : జనసేనను ఏపీలో బలపరిచేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కూటమిలో ఉంటూనే క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు నాగబాబు మొదటినుంచి తోడుగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపిస్తే ఎక్కువ ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే బెటరనే ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, మంత్రి హోదాలో నాగబాబును పార్టీ శ్రేణులకు దగ్గర చేయాలనే ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే నాగబాబు మంత్రివర్గంలో చేరే అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

జనసేన నుంచి ప్రస్తుతం ముగ్గురు : ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా మరో ఇద్దరు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. తాజాగా నాగబాబు కేబినెట్‌లో చేరితే జనసేన నుంచి మంత్రుల సంఖ్య నాలు

గుకు చేరుతుంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
రాజ్యసభకు ఇద్దరు : మరోవైపు ఏపీ నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలను రాజ్యసభకు పంపాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు వెంకటరమణ రావు మోపిదేవి, బీద మస్తాన్ రావు యాదవ్, ర్యాగ కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఈ మూడు సీట్లు గెలుచుకోవడం ఖాయమనే చెప్పాలి.

నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ సుజీత్ కుమార్ రాజ్యసభకు రాజీనామా చేశారు. బీజేపీ ఈ సీటును గెలుచుకునే అవకాశం ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన జవహర్ సర్కార్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో ఈ సీటును టీఎంసీ సునాయాసంగా గెలుచుకోనుంది. అధికార బీజేపీకి చెందిన కృష్ణలాల్ పన్వర్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. ఈ సీటను బీజేపీ తిరిగి నిలబెట్టుకోనుంది. హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యసభ సీటుకు పన్వర్ రాజీనామా చేసారు. ప్రస్తుతం నయబ్ సింగ్ షైని మంత్రివర్గంలో అభివృద్ధి, పంచాయతీరాజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News