Thursday, January 23, 2025

కొణిజర్లలో రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కొణిజర్ల: ఖమ్మం జిల్లా కొణిజర్లలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ నడి రోడ్డుపై బ్రేకులు వేయడంతో వెనుక కారు ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక ఉన్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విప్పలమడక గ్రామానికి చెందిన రాజేష్-సుజాత దంపతులు కొణిజర్ల నుంచి వైరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రాజేష్, సుజాత, కుమారుడు ఆశ్రిత్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రైవేట్
ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఐపిఎల్‌పై సిఎస్‌కె ముద్ర..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News