Friday, December 27, 2024

కొణతం దిలీప్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణా డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంపై, సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, కొణతం దిలీప్ అరెస్టును బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయనకు ఎందుకు అరెస్టు చేశారు..? ఏ కేసులో అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని బిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె క్రిశాంక్, సతీశ్ రెడ్డి, వాసుదేవ రెడ్డితో పాటు పలువురు నాయకులు బషీర్‌బాగ్‌లోని సిసిఎస్ కార్యాలయానికి వెళ్లారు. కొణతం దిలీప్‌కు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని వారు పోలీసులను అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే అతణ్ని అక్రమంగా అరెస్టు చేశారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. దిలీప్ వల్ల శాంతిభద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News