Sunday, January 12, 2025

ఎన్నికల తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి అడ్వైజరీ..

- Advertisement -
- Advertisement -

Koo App released Advisory for Fake News ahead of Polls

  సమాచారాన్ని ధృవీకరించే ఉద్దేశ్యంతో యూజర్లకు పేరుపొందిన ఫ్యాక్ట్ చెకర్‌లకు యాక్సెస్‌ని అనుమతిస్తుంది
 స్పామ్ మరియు అనవసరమైన కంటెంట్‌ను ప్రచారం చేసే 800 హ్యాండిల్‌లు పరిమితం చేయబడ్డాయి
 ఆన్‌లైన్‌లో అనుమతించదగిన లేదా నిషేధించబడిన వాటిపై యూజర్లకు సాధికారత మరియు అవగాహన కల్పించడానికి   బహుళ భాషలలో కమ్యూనిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల ఫలితాలకు ముందు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడానికి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కూ యాప్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. అడ్వైజరీతో పాటు, కూ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను కూడా ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉన్న మొత్తం 10 భాషల్లో విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాలు భారతీయ సంబంధింత పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తనను వివరిస్తూనే, మరింత ఆరోగ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడానికి క్రియేటర్లను, అలాగే మొదటిసారి యూజర్లను శక్తివంతం చేస్తాయి. మార్గదర్శకాలు ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం కోసం నిర్దిష్ట సూచనలను కలిగి ఉంటాయి. తగిన రుజువు లేకుండా సమాచారాన్ని ‘ఫేక్’ అని పిలవడం మానుకుంటూ, పోస్ట్ చేయడానికి ముందు సమాచారాన్ని ధృవీకరించడం యొక్క ప్రాముఖ్యతపై యూజర్లకు తెలియజేస్తుంది.

ఎన్నికల ఫలితాలకు ముందు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెరగడం సాధారణంగా కనిపిస్తుంది కాబట్టి సమాచారాన్ని ప్రామాణీకరించే ఉద్దేశ్యంతో కూ యూజర్లకు ప్రముఖ థర్డ్-పార్టీ ఫ్యాక్ట్ చెకర్‌లకు యాక్సెస్‌ని అందించింది. సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండటం వల్ల, కూ స్వయంగా ఖచ్చితత్వాన్ని అంచనా వేయదు లేదా చట్టం ద్వారా అవసరమైతే తప్ప కంటెంట్‌లో జోక్యం చేసుకోదు. అందువలన ఫాక్ట్ చెకర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం ద్వారా, ఆన్‌లైన్‌లో భద్రత, పారదర్శకతను నిర్మించడంలో దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

ఫేక్ న్యూస్ తరచుగా బాట్‌లు లేదా స్పామ్ అకౌంట్ల ద్వారా విస్తరింపబడుతున్నందున, కూ విశ్వసనీయ ప్లాట్‌ఫాంగా ఉండటం, తప్పుడు సమాచారాన్ని పరిమితం చేయడానికి అటువంటి అకౌంట్ల చర్యలను ముందస్తుగా పర్యవేక్షిస్తుంది. పరిమితం చేస్తుంది. 1 డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 28, 2022 వరకు, ప్లాట్‌ఫారమ్ 4,720 కంటే ఎక్కువ హ్యాండిల్‌లను గుర్తించింది. అవి తమను తాము న్యూస్ ఛానెల్‌లు, జర్నలిస్టులుగా లేదా వార్తలకు సంబంధించినవిగా గుర్తించాయి. వాటిలో 834 హ్యాండిల్స్ స్పామ్ లేదా అనవసరమైన కంటెంట్ కారణంగా పరిమితం చేయబడ్డాయి. కూ వారి ప్రవర్తనను పర్యవేక్షిస్తూనే ఉంటుంది.

కూ సిఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “మాతృభాషలలో స్వీయ-వ్యక్తీకరణకు సామాజిక వేదికగా, మేము క్రియేటర్లను, సృజనాత్మకత, ఆవిష్కరణలను పెంపొందించడానికి ఆన్‌లైన్‌లో మరింత సమగ్రమైన విధానాన్ని అవలంబించేలా యూజర్లను శక్తివంతం చేస్తాము. కీలకమైన సంఘటనల ముందు తప్పుడు సమాచారం ప్రధాన ఆందోళన. ఈ సలహా ద్వారా కూ ఒక బాధ్యతాయుతమైన ప్లాట్‌ఫాంగా – ఫేక్ న్యూస్, దుర్మార్గపు వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువ ఆన్‌లైన్ భద్రత మరియు పారదర్శకతను ప్రచారం చేస్తుంది. అడ్వైజరీ యూజర్లను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా మొదటిసారి యూజర్లు ఆన్‌లైన్‌లో మరింత అర్థవంతమైన సంభాషణలను రూపొందించడానికి సాంకేతికతను సానుకూలంగా, గౌరవప్రదంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. యూజర్లకు సురక్షితమైన, లీనమయ్యే అనుభవాన్ని అందించడానికి నిరంతర ప్రాతిపదికన ఉత్తమ అభ్యాసాలను గుర్తించడానికి కూ ప్రయత్నిస్తుందన్నారు

ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను నైతికంగా ఉపయోగించాలని కోరుకునే ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా స్వచ్ఛంద నీతి నియమావళిపై సంతకం చేసిన కూ ఎన్నికల ప్రక్రియపై మరింత విశ్వాసాన్ని పెంపొందించడానికి ఓటరు అక్షరాస్యతను పెంపొందించడం కూడా జరిగింది. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన వారి హక్కులు, బాధ్యతలపై తొలిసారిగా ఓటర్లకు సాధికారత కల్పించేందుకు ప్లాట్‌ఫాం-కూ ఓటర్ల మార్గదర్శిని – బహుళ భాషలలో ఎన్నికలకు ముందు విడుదల చేసింది. ప్లెడ్జ్ టూ ఓటు(PledgeToVote), యూపీ కా మేనిఫెస్టో (UP ka Manifesto) వంటి ఓటరు అవగాహన ప్రచారాలను విజయవంతంగా అమలు చేసింది.

Koo App released Advisory for Fake News ahead of Polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News