Thursday, January 23, 2025

ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన తీర్మానం పట్ల కూనంనేని హర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం , ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడంతో పాటు, వచ్చే శాసనసభ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఆర్ టి సి కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఇతరత్ర డిమాండ్ కూడా సానుకూలంగా పరిష్కరించాలన్నారు.వరద బాధితులకు ఆర్థిక సహా యంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టత నివ్వాలని, వారికి తక్షణ సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిఒ 59 కింద బిపిఎల్ వర్గాలకు ఉచితంగా, మధ్యతరగతి ప్రజలకు నామమాత్రపు ధరకే ఇంటి జాగాను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News