హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో సభ్యులు వ్యక్తిగత దూషణకు వెళ్లి సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సభ్యులను కోరారు. ఎంఐఎం, బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అనే. భావన కలిగేలా కెటిఆర్ మాట్లాడారు.. ఇది మంచిది కాదన్నది తన ఉద్దేశమని కూనంనేని సాంబశివరావు చెప్పారు. అసెంబ్లీని ఎక్కువరోజులు నడిపేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. 2020లో కేవలం 17 రోజులు, 2023 లో కేవలం 11 రోజులు మాత్రమే సభ నడిచిందని ఆయన పేర్కొన్నారు.
సభలో అర్ధవంతమైన చర్చ జరగాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో సభ మొక్కుబడిగా జరిగిందన్నారు. వైఎస్ చెప్పిన హామీలన్నీ నెరవేర్చారని కూనంనేని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉందన్నారు. సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయన్నారు. హామీలు నెరవేర్చడానికి డబ్బు ఇబ్బంది కాదని తెలిపిన కూనంనేని కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు.