Wednesday, January 22, 2025

దంపతులపై ఆరుగురు దాడి… భార్యపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దంపతులపై దాడి చేసి భర్త ముందే భార్యపై ఒకరు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం కొప్పాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దంపతులు ఇంటికి వెళ్లటానికి బస్టాప్ వద్దను నిలుచుకొని ఉండగా వారితో లింగరాజు, మౌలా హుస్సేన్, శివకుమార్ స్వామి, ప్రశాంత, మహేష్, మదేశ్ అనే వ్యక్తులు గొడవ పెట్టుకున్నారు. భర్తపై తీవ్రంగా దాడి చేసి అనంతరం భార్యను లాక్కెళ్లి ఆమెపై లింగ రాజు అనే వ్యక్తి అత్యాచారం చేశారు. దీంతో వెంటనే దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డిఎస్‌పి గంగవతి సిద్దలింగప్ప గౌడ పటేల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News