జగిత్యాల: దేశానికే దిక్సుచిగా దళిత సాధికారత పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టినందుకు ధర్మపురిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడారు. రూ.1200 కోట్లతో సిఎం దళిత సాధికారత పథకం అమలు చేయడం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సాయం చేస్తామని కొప్పుల స్పష్టం చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దళితులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దేశానికే దిక్సుచిగా దళిత సాధికారత పథకం: కొప్పుల
- Advertisement -
- Advertisement -
- Advertisement -