Friday, November 22, 2024

మల్లారెడ్డి ఇళ్లపై ఈడీ దాడులు.. మంత్రి కొప్పుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఈడీ దాడులపై మంత్రి కొప్పుల ఆగ్రహం
మల్లారెడ్డి ఇళ్లపై దాడులు దురదృష్టకరం
నీచంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
మన తెలంగాణ/ ధర్మారం: ఈడీ దాడులపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఇళ్లపై అకారణంగా ఈడి దాడులు నిర్వహించడం దురదృష్టకరమని మంత్రి ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి ఈశ్వర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ప్రాకులాడుతుందని, దేశవ్యాప్తంగా నీచ సంస్కృతిని ప్రోత్సహిస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏనాడూ దేశంలో ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదని, హింసాత్మక వైఖరితో బెదిరింపులకు పాల్పడుతూ, రాష్ట్రాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరమని, దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని మంత్రి ఈశ్వర్ అన్నారు.

సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే క్రమలంఓ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం అనవసర ప్రయోగాలు చేస్తుందని ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం గర్వపడుతుంటే కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈడీని అడ్డుం పెట్టుకొని రాష్ట్రంలో మంత్రులు ఇళ్లపై దాడులు చేయడం, రెచ్చగొట్టే వైఖరిని అవలంభించడం మంచి పద్దతి కాదని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణతో పోటీ పడి ప్రజల మెప్పు పొందాలని మంత్రి ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల కోసం పని చేస్తున ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News