Saturday, December 21, 2024

ఇలాంటి గవర్నర్ ఉండటం చాలా దురదృష్టకరం: కొప్పుల

- Advertisement -
- Advertisement -

గవర్నర్ తమిళిసై బిజెపి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ధర్మపురిలో మీడియా ప్రతినిధుతో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్, రాజకీయ పార్టీ నాయకురాలిగా పని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ప్రదమైన.. ఉన్నత విలువలు కలిగిన పదవిలో కొనసాగుతూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఇది సాంప్రదాయ విలువలకు విరుద్దమని అన్నారు.

గవర్నర్ వ్యవస్థకే కళంకితం తీసుకువస్తున్నారని, ఇలాంటి గవర్నర్ ఉండటం చాలా దురదృష్టకరమని అన్నారు. కేబినెట్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ సొంత ఎజెండాతో పని చేస్తున్నారని..గతంలోనూ చాలా సందర్బాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ఏ గవర్నర్ ఈ విధంగా వ్యవహరించలేదన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చతెచ్చే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తీరుమార్చుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News