కరీంనగర్: జిల్లాలోని శ్రీపురం కాలనీలో కాలనీ చిన్నారులతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రికి చిన్నారులు రంగులతో తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులతో కాసేపు హోలీ సంబరాలు చేసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగలు మన సంస్కృతిని చాటి చెప్తాయన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారుని తెలిపారు.
Koppula Eshwar Holi Wishes to People
- Advertisement -