Monday, December 23, 2024

ఎస్‌సి గురుకులంలో కొప్పుల ఈశ్వర్ ఆకస్మిక తనిఖీ..

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలిఫమంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్‌సి గురుకులం ఆకస్మిక తనిఖీ
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గోల్కొండ సమీపంలోని షేక్‌పేట ఎస్‌సి గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీని (సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్‌సిఒఇ) మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూమ్స్, కారిడార్స్, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఆలనా పాలన గురించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇక్కడ చదువుకుంటున్నారని, వీరిని మీ సొంత బిడ్డల్లా చూసుకోవాలని, వీరి బాధ్యతంతా మీ పైనే ఉంటుందని అన్నారు.

విద్యార్థులకిచ్చే తాగునీటిని కాచి వడబోసి గోరువెచ్చగా, భోజనాన్ని వేడివేడిగా అందించాలని ఆదేశించారు. గురుకుల విద్యా విధానంలో మన తెలంగాణ దేశమంతటికి ఆదర్శమని, ఇక్కడ చక్కని విద్యాబుద్దులతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రతి ఏటా లక్షా 25 కవేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. చక్కని ఫలితాలు కూడా వస్తున్నాయని, అన్ని రంగాలలో బాగా రాణిస్తున్నారని మంత్రి చెప్పారు. వీరిపై మరింత శ్రద్ధ చూపి ఉత్తమ పౌరులుగా , ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రి తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, వెల్‌నెస్ సెంటర్, ఇండోర్ స్టేడియం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మాటామంతి జరిపారు. బోధన జరుగుతున్న తీరు, వడ్డిస్తున్న భోజనం, ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధాసక్తులు, అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Koppula Eshwar Inspects in SC Gurukul School

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News