Monday, December 23, 2024

మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖ అధికారుల సమన్వయంతో మొహరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా సహకరిస్తున్నామని చెప్పారు.

Also Read: కెసిఆర్ కొట్టే మొగోణ్ణి నేనే….

ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్‌ బాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌నదీం, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News