Thursday, January 23, 2025

అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం: కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

Koppula Eshwar Review Meeting on 'Dalit Bandhu'

దళితబంధుపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష
అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం
70 నుంచి 80 శాతం గ్రౌండింగ్ పూర్తి
లబ్ధిదారులకు అందచేసే యూనిట్లు పంపిణికి సిద్ధం
హైదరాబాద్: దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం దళిత బంధుపథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రి కొప్పుల సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సూచనలను పరిగణలోకి తీసుకొని ఒక్కో నిరుపేద దళితకుటుంబానికి 10 లక్షల అర్ధిక సాయన్ని అందచేస్తున్నట్లు వివరించారు. ఆర్ధికసాయం పొందిన లబ్దిదారులు వారికి నచ్చిన యూనిట్లు స్థాపించుకొని ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 3500 మించి అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యిందన్నారు. లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరిని గుర్తించి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు సూచించిన లబ్ధిదారులకు కూడా దళితబంధు పథకం వర్తింప చేస్తున్నట్లు మంత్రి కొప్పుల చెప్పారు. అక్కడక్కడ దళితబంధు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు నచ్చిన వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈనెల 27న ఖమ్మం జిల్లా చింతకానిలో దళితబంధు పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

Koppula Eshwar Review Meeting on ‘Dalit Bandhu’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News