Sunday, January 19, 2025

తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు మానుకోవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి నేతలు తప్పుడు విమర్శలు మానుకోవాలని ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై తప్పుడు ప్రకటన చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కొప్పుల ఖండించారు. తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి ప్రధానిచే ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. వడ్లు కొనడం చేతకాని బిజెపి ప్రభుత్వం అడ్డగోలు రాజకీయం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణలో అమలవతున్న పథకాలు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఓ సారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.

Koppula Eshwar slams Union Minister Kishan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News