Wednesday, January 22, 2025

దేశ చరిత్ర పుటల్లో నిలిచిన రోజు ఇది: మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ చరిత్ర పుటల్లో నిలిచిన రోజు ఇది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సిఎం కెసిఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సంభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశంలో ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ఆయన తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నామని కొప్పులు పేర్కొన్నారు. అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని ఆయన అభిర్ణించారు. కెసిఆర్ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణమని మంత్రి వెల్లడించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో దళితబంధు ఆదర్శంగా అమలవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News