Monday, December 23, 2024

సివిల్స్ లో 117వ ర్యాంకర్ నరేష్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో పాటు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నరేష్

నరేష్ ఎస్సి గురుకులాల పూర్వ విద్యార్థి

మంత్రితో కలిసి అల్పాహారం తీసుకున్న నరేష్

ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకులాల అధికారులు శారద, చంద్రకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు

హైదరాబాద్: పేదింటి బిడ్డ, ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థి ఆకునూరి నరేష్ సివిల్స్ లో 117వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇతను 6 నుంచి 10వ తరగతి వరకు నర్సంపేట, ఇంటర్మీడియట్ రంగారెడ్డి జిల్లా చిలుకూరు గురుకుల పాఠశాలల్లో చదువుకున్నారు. ఐఎఎస్ లో మంచి ర్యాంకు సాధించిన నరేష్ ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో కలిసి బుధవారం ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ నరేష్ కు పుష్పగుచ్ఛమిచ్చి శాలువాకప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆశీర్వదించారు. నరేష్ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రితో కలిసి అల్పాహారం తీసుకున్నారు.కార్యక్రమంలో సొసైటీ అధికారులు శారద, చంద్రకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News