Saturday, February 22, 2025

హోటల్‌కు తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హోటల్‌కు తీసుకెళ్లి మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీకి చెందిన ఓ మహిత తన భర్తతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటుంది. ఆమె క్యాటరింగ్ సర్వీస్ లో పని చేస్తూ భర్తకు సంపాదనలో చేదోడువాదోడుగా ఉంది. గురువారం సాయంత్రం జ్యోతి నివాస్ కాలేజీ జంక్షన్ వద్ద ఆమె వేచి ఉండగా నలుగురు యువకులు ఆమెతో మాట కలిపి హోటల్‌కు తీసుకెళ్లారు.

నలుగురు కలిసి ఆమెతో భోజనం చేసిన అనంతరం అసభ్యంగా ప్రవర్తించారు. హోటల్ టెర్రాస్ పైకి తీసుకెళ్లి ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆమె వదిలి వేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తన భర్తకు జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు పశ్చిమ బెంగాల్ చెందిన వారుకాగా ఒకరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు వివిధ హోటళ్లలో చెఫ్‌లు, వెయిటర్లు, హెల్పర్లుగా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News