Wednesday, January 22, 2025

మీసాల మిస్టరీ మూవీ

- Advertisement -
- Advertisement -

 

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడి యా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ’కోరమీను’. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మ త్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో ముడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బా గా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పో లీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీ ను’. ఈనెల 31న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ‘బింబిసార’ దర్శకు డు వశిష్ఠ, సింగర్ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ ‘ఆనంద్ రవి మంచి కథ ఇచ్చారు. పూర్ణాచారి, ప్రియాంక చక్క గా పాటలు రాశారు. సినిమాలో శత్రు అద్భుతమైన పాత్ర చేశారు. ఇందు, కిషోర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు’అని చెప్పారు. నిర్మాత సమస్య రెడ్డి మాట్లాడుతూ ‘ఆనంద్ రవి చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశా ము. హీరోగా ఆనంద్ రవి అద్భుతంగా నటించారు. సిని మా చాలా బాగా వచ్చింది’అని తెలిపారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ “ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసా లు ఎవరు తీసేశారు? అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కాబట్టి ఇదొక జోనర్ మూవీ అ నవచ్చు. దీన్నిక మీసాల మిస్టరీ అనుకోవచ్చు. ఈనెల 31న మా సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కిషోర్ దత్రక్, లక్ష్మీ ప్రియాంక, పూర్ణాచారి, జబర్దస్త్ ఇమ్యాన్యూయేల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News