Sunday, December 22, 2024

బన్నీకి బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుపొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా ద్వారా బన్నీని అభినందిస్తుండగా, మరికొందరు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అల్లు అర్జున్‌ను అతని నివాసంలో కలిసి పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ కొరటాల శివ కూడా బన్నీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోబోతున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ, పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ లతో తన తర్వాతి ప్రాజెక్టులను ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News