Wednesday, January 29, 2025

‘వారసుల’ వార్

- Advertisement -
- Advertisement -

కోరుట్లలో ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయ వారసులే..

(బట్టు హరికృష్ణ/మన తెలంగాణ):  రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోలాహలంలో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ’వారసులే’ కావడం విశేషంగా పరిణమించింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్లో భాగంగా నామినేషన్ల పర్వంలో మొత్తం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ త్రిము ఖ పోటీ నెలకొందన్న అంచనా. ఈ క్రమంలో కోరుట్ల ఎన్నికల బరిలో నిలిచిన ము గ్గురు ప్రధాన అభ్యర్థులు రాజకీయ వారసులే కా వడం విశేషంగా మారి ంది.

అధికార బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కేంద్రంలోని అధికార బిజెపి పక్షాన నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవిం ద్, కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తరపున జువ్వాడి నర్సింగరావులు బరిలో నిలిచారు. అయితే బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన పోటీకి దిగిన సంజయ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్’రావు కుమారుడు. అలాగే బిజెపి అభ్యర్థిగా బరి లో నిలిచిన అరవింద్ మాజీ మంత్రి, పీసిసి మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు. కాగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ఎన్నికల్లో తలపడుతున్న నర్సింగరావు కూడా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్’రావు కొడుకు కావడం మరో విశేషం. ప్రస్తుతం కోరుట్ల శాసనసభా నియోజకవర్గ ఎన్నికల హోరాహోరీ పోరులో ప్రధానంగా బీఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్యనే బలమైన పోటీ నెలకొందన్న వాదనలున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తలపడుతున్న ప్రధాన అభ్యర్థులు ముగ్గు రూ రాజకీయ వారసులే కావడం ప్రత్యేకతను సం చరించుకోగా, ప్రచారంలోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నది. బిజెపి అభ్యర్థి ఎంపీ అరవింద్ తండ్రి ధర్మ పురి శ్రీనివాస్ నిజామాబాద్’కు చెందిన రాజకీయ నాయకుడు కాగా, బిఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్’రావు, కాంగ్రెస్ అభ్యర్థి నర్సింగరావు తండ్రి జువ్వాడి రత్నాకర్’రావు ఇరువురు కూడా కోరుట్ల ప్రా ంతానికి చెందిన రాజకీయ నాయకులే. ఈ క్రమ ంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుం ట్ల సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కోరుట్ల నియోజకవర్గ పరిధిలో తన తండ్రి విద్యాసాగర్’రావు చేసిన అభివృద్ధిని చూసి తన కే ఓటేయాలని ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి కోరుట్ల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తన తండ్రి జువ్వాడి రత్నాకర్’రావు పనితీరును చూసి తననే గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఓటర్లను కోరుతున్నారు. మొత్తం మీద కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ వారసుల పోరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎన్నికల బరిలో ఓటర్లు ఎలా స్పందిస్తారో ఏ వారసునికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News