Sunday, January 19, 2025

కోస్గిని రెవెన్యూ డివిజన్‌గా అయ్యేది ఎప్పుడో..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ కోస్గి:  కోస్గి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చిన హామీని విస్మరించారని,రెవెన్యూ డివిజన్‌గా అయ్యేది ఎప్పుడని కోస్గి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెజ్జు రాములు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన జిల్లాలు, మండల కేంద్రాలుగా అభివృద్ది చేసిన కోస్గి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు. ఏళ్లు గడుస్తున్న నేటికీ ప్రభుత్వం కోస్గి పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని కోస్గి పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News