Thursday, December 19, 2024

కోస్గి పట్టణ అభివృద్ధికి కుల మతాలకు అతీతంగా ఏకమవ్వాలి

- Advertisement -
- Advertisement -

కోస్గి: కోస్గి పట్టణ అభివృద్దికి కుల మతాలకు అతీతంగా ఏకమవ్వాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.బుధవా రం మున్సిపల్ కార్యాలయంలో సయ్యద్ పహాడ్ దర్గా నుంచి ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా అఖిల పక్ష నాయకులు,అన్ని మ తాల పెద్దలు,అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న దేవాలయాలు,మసీదు లు,ప్రార్థన మందిరాల స్థలాలను స్వచ్చందంగా రో డ్డు పనులకు అన్ని మతాల వారు,అన్ని పార్టీలకు చెందిన నాయకులందరూ సహకరిస్తేనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.

పట్టణ అభివృద్దికి అందరం ఐక్యమత్యంగా సహకరిస్తామని హామీ ఇవ్వడంతో రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.అన్ని పార్టీల,అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం మేరకు ఇరువైపులా 25ఫీట్లు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని అన్నారు.ఈ రహదారి విస్తరణ కోసం 10కోట్ల నిధులతో చేపడుతున్నామని అన్నారు. దే వాలయాలకు,మసీదులకు,ప్రార్థన మందిరాలకు ఎస్‌డిఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని హామీ ని చ్చారు. రహదారి విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు జరిగిన నష్టాన్ని బట్టి ప్లాట్లు,ఇల్లు కే టాయించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.

పట్టణంలోని ఆయా కాలనీల్లో తాగునీటి సమస్యతో తీ్ర వ ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్లు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకురాగా ఆయా శాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష, విద్యుత్ డిఈ సంజీవరెడ్డి,ఆర్ అండ్ బి డిఈ రా ములు,మున్సిపల్ కమీషనర్ శశిధర్,కౌన్సిలర్లు గోవర్థన్‌రెడ్డి,మాస్లర్ శ్రీను,భానునాయక్, ఇద్రీస్, బందెప్ప,కో అప్షన్ సభ్యుడు ఓం ప్రకాష్‌లతో పా టు వివిధ పార్టీ నాయకులు,అన్ని మతాల పెద్దలు, అన్ని శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News