Friday, December 20, 2024

‘కోట బొమ్మాళి పిఎస్’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది.

తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ కు రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతుంది. జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News