జైపూర్: నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లా సాలుంబర్ ప్రాంతానికి చెందిన మెహుల్ వైష్ణవ్ నీట్ ఎంట్రెన్స్ కోసం చదువుతున్నాడు. కోటాలోని విజ్ఞాన్ నగర్‌లో హాస్టల్‌లో ఉండి నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తన హాస్టల్ రూమ్ నుంచి అతడు బయటకు రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేయగా అతడు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఆదిత్య అనే విద్యార్థి రెండు నెలల క్రితం నీట్ కోచింగ్ కోసం కోటాకు వచ్చాడు. ఆదిత్య కూడా తన హాస్టల్ రూమ్‌లో ఉరేసుకున్నాడు. గత రెండు నెలల వ్యవధిలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మే నెలలో ఐదుగురు, జూన్ నెలలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read: రాజన్నసిరిసిల్లలో భార్యపై భర్త కొడవలితో దాడి