Sunday, December 22, 2024

నీట్ ఎగ్జామ్‌లో ఫెయిల్… విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్: నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన రోషన్(21) అనే విద్యార్థి కోటాలో ఉంటున్నారు. కోటాలోని మహవీర్ నగర్ ప్రాంతంలో రూమ్ తీసుకొని నీట్ కోచింగ్‌కు వెళ్తున్నాడు. నీట్ పరీక్షలో ఫెయిల్ కావడంతో గురువారం ఢిల్లీ నుంచి కోటా తిరిగి వచ్చాడు. ఢిల్లీ నుంచి వెళ్లిన రోషన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరుడు సుమన్ అతడి రూమ్‌కు వెళ్లాడు. రూమ్‌లో రోషన్ ఉరేసుకొని కనిపించడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. రోషన్ ఇది రెండో సారి నీట్ ఎగ్జామ్ రాశాడు.

Also Read: బిఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై ముగిసిన ఐటి సోదాలు…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News