జైపూర్: 16 ఏళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం చేయడంతో అతడి నుంచి కాపాడుతామని చెప్పి మరో ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారం పలుమార్లు చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని జరిగింది. పోలీలు తెలిపిన వివరాల ప్రకారం…. బరాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సంవత్సరాల క్రితం తల్లి చనిపోవడంతో 13 ఏళ్ల బాలిక తన తండ్రి(68)తో కలిసి ఉంటుంది. తన కూతురు కనిపించడంలేదని జూన్ 22న తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జూన్ 30న బాలికను గుర్తించి విచారణ ప్రారంభించారు.
Also Read: గడ్డి పరకలను గడ్డపారలుగా మార్చిన యోధుడు
గత 18 నెలల నుంచి తన తండ్రి లైంగికంగా వేధిస్తుండడంతో పాటు తనపై అత్యాచారం చేశానని చెప్పాడు. ఇదే విషయాన్ని తన తెలిసిన 29 ఏళ్ల వ్యక్తి చెప్పడంతో ఆమె తండ్రి నుంచి కాపాడుతానని బాలికను తీసుకెళ్లాడు. అతడు మరో స్నేహితుడితో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.