Tuesday, December 24, 2024

నేను చనిపోలేదు: కోట శ్రీనివాస రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై నటుడు కోట శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం బాధకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా కోట మీడియాతో మాట్లాడారు. కేవలం డబ్బు సంపాదన కోసం ఇలాంటి వార్తలు రాయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఉదయం నుంచి 50పైగా ఫోన్లు వచ్చాయని, పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారని, అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మొదని కోట తెలిపారు.
కోట మరణించారని తెలిసి నెటిజన్లు రిప్ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో తాను మరణించలేదని చెప్పగానే బతికి ఉన్న సోషల్ మీడియాలో నెటిజన్లు చంపేస్తున్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. జీవితంలో చివరి దశకు చేరుకున్న సినీ నటులపై ఇలాంటి వార్తలు రావడం బాధకరమైన విషయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News