Thursday, January 23, 2025

మహేష్ బాబును ఓదార్చిన కోట శ్రీనివాసరావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు పద్మాలయా స్టూడియోస్‌లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. నటుడు కృష్ణను చూసి కోటా శ్రీనివాసరావు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అనంతరం మహేష్ బాబును ఓదార్చి భావోద్వేగానికి గురయ్యారు.

గతంలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… కృష్ణతో దాదాపు 50 చిత్రాల్లో నటించానని, తన కెరీర్‌లో విజయం సాధించేందుకు ఆయన ఎంతగానో ప్రోత్సహించారన్నారు. కృష్ణ తెల్లకాగితం లాంటివాడని, కృష్ణ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News