Monday, December 23, 2024

ఆసక్తికరంగా ‘కోట బొమ్మాళి పి.ఎస్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

- Advertisement -
ప్రముఖ నిర్మాణ సంస్థ జిఎ 2 పిక్చర్స్ మరో ఆసక్తికర థ్రిల్లర్ రాబోతోంది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి ‘కోట బొమ్మాళి పి.ఎస్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు.టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News